IRDAI: ఐఆర్‌డీఏఐ చైర్మన్‌గా నియమితులైన ఐఏఎస్ ఆఫీసర్?
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) చైర్మన్‌గా ఐఏఎస్ ఆఫీసర్ దేవశిష్ పాండా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామకానికి తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్లపాటు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. 1987 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన పాండా, ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందినవారు. గతంలో ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. అంతకుముందు ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ డివిజన్ అడిషనల్ కార్యదర్శిగా పనిచేశారు. ఐఆర్‌డీఏఐ బోర్డ్, బీమా ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రభుత్వ నామినీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) బోర్డ్‌లో కూడా విధులు నిర్వహించారు. 2021, మే నెలలో సుభాష్ చంద్ర కుంతియా బాధ్యతల విరమణ చేసిన తర్వాత ఐఆర్‌డీఏఐ చైర్మన్ పదవికి నియామకం జరగలేదు.
Tamil Nadu: చెన్నై మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తొలి దళిత మహిళ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) చైర్మన్‌గా నియమితులైన ఐఏఎస్ ఆఫీసర్?
ఎప్పుడు : మార్చి 12
ఎవరు : దేవశిష్ పాండా
ఎందుకు : కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు..
CBI: ఎన్‌ఎస్‌ఈ మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణను ఏ కేసులో అరెస్ట్ చేశారు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్