Shigeru Ishiba: జపాన్ నూతన ప్రధాని షిగేరు ఇషిబా
Sakshi Education
జపాన్ నూతన ప్రధానిగా మాజీ రక్షణశాఖ మంత్రి షిగెరు ఇషిబా అక్టోబర్ 1వ తేదీ ప్రమాణ స్వీకారం చేశారు.
ఆయనతో పాటు 19 మంది మంత్రులు కూడా ఈ రోజు ప్రమాణం చేశారు. ప్రధాని పదవిలో ఉన్న ఫుమియో కిషిదా తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 67 ఏళ్ల షిగెరు ఇషిబా లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఇషిబా ప్రధాని పదవికి పోటీపడిన 9 మంది ఎల్‌డీపీ నేతలలో, మెజారిటీ ఆయన అభ్యర్థిత్వాన్ని మద్ధతుగా నిలబెట్టారు. దీంతో, ఆయన జపాన్ 102వ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.
ఇషిబా తన కెరీర్‌ను బ్యాంకింగ్ రంగంలో ప్రారంభించి, 29 ఏళ్ల వయసులో 1986లో పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ప్రభుత్వ విధానాలను బహిరంగంగా వ్యతిరేకించడం వల్ల తరచూ వార్తల్లో నిలిచారు. గత ఎల్‌డీపీ ప్రభుత్వంలో ఆయన రక్షణశాఖ మంత్రిగా సేవలు పనిచేశారు.
Sri Lanka New PM: శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య.. ఈమె డిగ్రీ చదివింది ఢిల్లీలోనే..
Published date : 03 Oct 2024 02:59PM