Attorny General గా ఆర్.వెంకటరమణి
Sakshi Education
భారత తదుపరి అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది ఆర్.వెంకటరమణి పేరుని న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ఈ మేరకు ట్వీట్ చేశారు.
నియామకాన్ని నిర్ధారిస్తూ కేంద్ర న్యాయ శాఖ పరిధిలోని లీగల్ అఫైర్స్ విభాగం సెప్టెంబర్ 28న నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పదవిలో వెంకటరమణి మూడు సంవత్సరాలపాటు కొనసాగుతారు. ప్రస్తుత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పదవీకాలం ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. వేణుగోపాల్ స్థానంలో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని నియమించాలని గతంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే, సొంత కారణాలతో రోహత్గీ ఆ ప్రతిపాదనను ఇటీవల తిరస్కరించారు. వెంకటరమణి అక్టోబర్ ఒకటో తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు. మోదీ తొలిసారిగా ప్రధాని అయినపుడు 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకు రోహత్గీనే అటార్నీగా ఉన్నారు. ఆయన పదవీకాలం ముగిశాక వేణుగోపాల్ సేవలందించారు.
Also read: PM కేర్స్ ట్రస్టీగా రతన్ టాటా
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 29 Sep 2022 07:41PM