Andrey Botikov: స్పుత్నిక్–5 టీకా సృష్టించిన సైంటిస్టు హత్య
Sakshi Education
రష్యా కోవిడ్ టీకా స్పుత్నిక్–5 సృష్టికర్తల్లో ఒకరైన అగ్రశ్రేణి శాస్త్రవేత్త ఆండ్రీ బొటికోవ్ (47) హత్యకు గురయ్యారు.
మాస్కోలోని అపార్టుమెంట్‌లోనే మార్చి 2వ తేదీ గుర్తు తెలియని వ్యక్తులు బెల్టుతో గొంతు నులిమి చంపారు. గమలెయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ మేథమేటిక్స్‌లో సీనియర్ పరిశోధకుడిగా ఉన్నారు. ఇక్కడే మరో 18 మంది శాస్త్రవేత్తలతో కలిసి 2020లో స్పుత్నిక్ వీ టీకాను రూపొందించారు. హత్యకు పాల్పడిన 29 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు రష్యా ఫెడరల్ దర్యాప్తు కమిటీ మార్చి 4న వెల్లడించింది. ఆండ్రీ బొటికోవ్‌తో చిన్న విషయమై తలెత్తిన తగాదాతోనే ఈ నేరానికి పాల్పడినట్లు అతడు అంగీకరించాడని కూడా తెలిపింది. నిందితుడికి నేర చరిత్ర ఉందని పేర్కొంది. కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఎన్నదగిన పరిశోధనలు జరిపిన వైరాలజిస్ట్ ఆండ్రీ బొటికోవ్‌ను 2021లో అధ్యక్షుడు పుతిన్ ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఫర్ ది ఫాదర్‌లాండ్’ పురస్కారంతో సత్కరించారు.
Caste Discrimination: కులవివక్షను నిషేధించిన సియాటిల్
Published date : 06 Mar 2023 01:05PM