Skip to main content

APPSC Chairperson: ఏపీపీఎస్సీ కొత్త ఛైర్‌పర్సన్‌గా అనురాధ

ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ ఏఆర్‌ అనురాధను నియమించారు.
Retired IPS Officer Anuradha Appointed as APPSC New Chairperson  Retired IPS AR Anuradha appointed as Chairperson of APPSC Chief Secretary Nirabh Kumar Prasad issues appointment order for Anuradha

అక్టోబర్ 23వ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్ దీనికి సంబందించిన ఉత్తర్వులు జారీ చేశారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తూ గత ఏడాది అక్టోబర్ నెలాఖరున అనురాధ పదవీ విరమణ చేశారు. 

ఏఆర్ అనురాధ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ విభాగానికి చీఫ్‌గా పనిచేసిన మొదటి మహిళా ఐపీఎస్‌గా గుర్తింపు పొందారు. గతంలో ఏపీ ఇంటిలిజెన్స్ డీజీగా, విజిలెన్స్ డీజీగా,హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా పలు కీలక శాఖలు ఆమె నిర్వహించారు.

ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతం సవాంగ్‌ను జులై నెలలో కూటమి ప్రభుత్వం రాజీనామా చేశారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఏపీ క్యాండర్‌కు చెందిన ఏఆర్‌ అనురాధ భర్త నిమ్మగడ్డ సురేంద్రబాబు కూడా ఐపీఎస్ ఆఫీసరే.   

Vijaya Kishore: జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా విజయ కిశోర్‌

అయితే.. గత మూడు నెలలుగా చైర్మన్ లేకుండా ఏపీపీఎస్సీ ఉంది. చైర్మన్‌ లేకపోవడంతో జులై 28 న జరగాల్సిన గ్రూప్-2, అలాగే సెప్టెంబర్ 2 నుంచి పది వరకు నిర్వహించాల్సిన గ్రూప్‌-1ను చంద్రబాబు సర్కార్‌ వాయిదా వేసింది. ఏడాది పాటే ఏపీపీఎస్సీ చైర్మన్‌గా అనురాధ ఉండనున్నారు. చైర్మన్ పదవికి గరిష్ట వయస్సు 62 ఏళ్లు కావడంతో అనూరాధకి ఏడాది పాటే పనిచేసే అవకాశం ఉంది.

Retired IPS Officer Anuradha Appointed as APPSC New Chairperson

 

Published date : 24 Oct 2024 08:32AM

Photo Stories