Skip to main content

Chalapathi Rao: పీవీ చలపతిరావు కన్నుమూత

భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, ఆ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ పీవీ చలపతిరావు (87) కన్నుమూశారు.

కొంతకాలంగా వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయ‌న జ‌న‌వ‌రి 1న విశాఖ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కుమారుడు పి.వి.ఎన్‌.మాధవ్‌ ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా కొసాగుతున్నారు.

1935 జూన్‌ 26న జన్మించిన చలపతిరావు పదేళ్ల వయసులోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరి చురుకైన పాత్ర పోషించారు. 1967 నుంచి విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొన్నారు. 1973లో ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించి పలుమార్లు అరెస్టయ్యారు. ఎమర్జెన్సీ కాలంలో లోక సంఘర్షణ సమితి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఆయన 19 నెలలు అజ్ఞాతంలో గడిపారు. 1980 నుంచి 1986 వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయన ఉత్తర సర్కారు జిల్లాల గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గం నుంచి 1974లోను, 1980లోను శాసనమండలికి ఎన్నికయ్యారు. చలపతిరావు పార్ధివదేహాన్ని ప్రజలు, పార్టీ శ్రేణుల సందర్శనార్థం విశాఖ పిఠాపురం కాలనీలోని ఆయన స్వగృహంలో ఉంచారు.   

వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (03-09 డిసెంబర్ 2022)

Published date : 02 Jan 2023 01:25PM

Photo Stories