Friendship Award: సీగల్‌కు రష్యా ఫ్రెండ్‌షిప్ అవార్డు
Sakshi Education
ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని సమర్థించిన హాలీవుడ్ యాక్షన్ స్టార్ స్టీవె న్ సీగల్ (70)కు రష్యా ‘ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్’ అవార్డు ప్రకటించింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సీగల్ గట్టి మద్దతుదారు. 2014లో క్రిమియా ఆక్రమణను కూడా సమర్థించారు. 2016లో ఆయనకు రష్యా తమ దేశ పౌరసత్వం కూడా ఇచ్చింది. అంతేగాక పుతిన్ వ్యక్తిగతంగా సీగల్‌కు రష్యా పాస్‌పోర్టు అందజేశారు! 2018 నుంచీ అమెరికా, జపాన్ దేశాల్లో రష్యా విదేశాంగ శాఖ ప్రత్యేక రాయబారిగా కూడా సీగల్ పని చేస్తున్నారు. అమెరికా మాజీ విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్, ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో తదితరులకు కూడా ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ అవార్డు ప్రకటించారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)
Published date : 01 Mar 2023 12:14PM