Rajya Sabha: రాజ్యసభ 13వ సెక్రటరీ జనరల్‌గా నియమితులైన అధికారి?
రాజ్యసభ 13వ సెక్రటరీ జనరల్‌గా 1982 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి ప్రమోద్ చంద్ర మోదీ నియమితులయ్యారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) మాజీ చైర్మన్ అయిన ప్రమోద్ చంద్ర మోదీ(పీసీ మోదీ), తెలుగు వ్యక్తి అయిన డాక్టర్ పరాశరం పట్టాభి కేశవ రామాచార్యుల స్థానంలో నవంబర్ 12న సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు. 2022, ఆగస్ట్ 10 వరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా మోదీ కొనసాగనున్నారు.
స్వల్ప కాలం పనిచేసిన వారిలో 2వ వ్యక్తి...
2021, సెప్టెంబర్ 1న రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన పీపీకే రామాచార్యులు 72 రోజుల పాటు మాత్రమే బాధ్యతలు నిర్వహించారు. దీంతో సెక్రటరీ జనరల్‌గా స్వల్ప కాలం పనిచేసిన వారిలో 2వ వ్యక్తిగా నిలిచారు. అంతకు ముందు 1997 జూలై 25న బాధ్యతలు చేపట్టిన ఎస్‌ఎస్ సహోని 1997 అక్టోబర్ 2 వరకు ఆ పదవిలో ఉన్నారు. తాజాగా పీపీకే రామాచార్యులును రాజ్యసభ సెక్రటేరియట్ సలహాదారుగా నియమించారు.
చదవండి: Nobel Peace Prize: దక్షిణాఫ్రికాకు చివరి శ్వేతజాతి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాజ్యసభ 13వ సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన ఐఆర్‌ఎస్ అధికారి?
ఎప్పుడు : నవంబర్ 12
ఎవరు : ప్రమోద్ చంద్ర మోదీ(పీసీ మోదీ)
ఎందుకు : ఇప్పటివరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన పీపీకే రామాచార్యులు రాజ్యసభ సెక్రటేరియట్ సలహాదారుగా నియమితులు కావడంతో...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్