Parkash Singh Badal: పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్ కన్నుమూత..
గ్యాస్ట్రైటిస్, బ్రాంకియల్ ఆస్త్మాతో బాధపడుతూ గత ఏడాది జూన్‌లో మళ్లీ చికిత్స పొందారు.
ఐదుసార్లు పంజాబ్ సీఎం
బాదల్ 1927 డిసెంబర్ 8న పంజాబ్‌లోని అబుల్ ఖురానా గ్రామంలో జాట్ సిక్కు కుటుంబంలో జన్మించారు. లాహోర్‌లోని ఫార్మన్ క్రిస్టియన్ కాలేజీలో చదివారు. 1947లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. గ్రామ సర్పంచ్‌గా, బ్లాక్ సమితి చైర్మన్‌గా మొదలై 1957లో కాంగ్రెస్ టికెట్‌పై ఎమ్మెల్యే అయ్యారు. 1969లో శిరోమణి అకాలీ దళ్ టికెట్‌పై మళ్లీ గెలిచారు. 1986లో శిరోమణి అకాలీ దళ్ (బాదల్) పార్టీని స్థాపించారు. 1970–71, 1977–80, 1997–2002, 2007–2012, 2012–2017 ఇలా ఐదుసార్లు పంజాబ్ సీఎంగా చేశారు. గతేడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో 13వసారి పోటీ చేశారు. దేశంలోనే అత్యంత వృద్ధ అభ్యర్థిగా రికార్డుకెక్కినా ఓటమి పాలయ్యారు. ఏడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయనకిది రెండో ఓటమి. ఎంపీగా కూడా నెగ్గిన ఆయన కేంద్ర వ్యవసాయ, సాగునీటి పారుదల మంత్రిగా పనిచేశారు. ఆయన భార్య సురీందర్ కౌర్ 2011లో మరణించారు. కుమారుడు సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ పంజాబ్ ఉప ముఖ్యమంత్రిగా చేశారు.