Bajireddy Goverdhan: రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్‌గా నియమితులైన ఎమ్మెల్యే?
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) చైర్మన్‌గా సీనియర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నియమితులయ్యారు. ఈ మేరకు సెప్టెంబర్ 16న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 వరకు ఆర్టీసీ చైర్మన్‌గా సోమారపు సత్యనారాయణ పనిచేశారు. ఆ తరువాత నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చీమన్‌పల్లి గ్రామానికి చెందిన బాజిరెడ్డి... 1999 నుంచి 2004 వరకు ఆర్మూర్ ఎమ్మెల్యేగా, 2004 నుంచి 2009 వరకు బాన్సువాడ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014 నుంచి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు.
నమామి గంగే మిషన్‌కు...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందుకున్న బహుమతులు, జ్ఞాపికలను ఈ–వేలం నిర్వహించేందుకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు జరిగే ఈ–వేలం ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని గంగా పరిరక్షణ, పునరుజ్జీవనం కొరకు నమామి గంగే మిషన్‌కు అందించనున్నారు.
చదవండి: ఏపీ తదుపరి సీఎస్‌గా నియమితులు కానున్న అధికారి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 17
ఎవరు : నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
ఎందుకు : ఆర్టీసీ చైర్మన్ పదవి ఖాళీగా ఉన్న నేపథ్యంలో...