Andhra Pradesh Chief Secretary: ఏపీ తదుపరి సీఎస్‌గా నియమితులు కానున్న అధికారి?
ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ 2021, సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో తదుపరి సీఎస్‌గా డా.సమీర్ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఈయన రాష్ట్ర ప్రణాళిక, రిసోర్స్ మొబిలైజేషన్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
2020–21లో దేశీయ ఎగుమతుల్లో తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం?
2019–20లో దేశీయ ఎగుమతుల్లో ఏడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. ఎగుమతులను ప్రోత్సహించడంతో 2020–21లో నాలుగో స్థానానికి చేరుకుంది. మొత్తం దేశ ఎగుమతుల్లో 21 శాతం వాటాతో గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా, 20 శాతంతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో 9 శాతంతో తమిళనాడు, 6 శాతంతో ఆంధ్రప్రదేశ్.. మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
చదవండి: రాష్ట్రంలోని ఏ జిల్లాలో వజ్రాల లభ్యత ఉన్నట్టు జీఐఎస్ గుర్తించింది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ఏపీ తదుపరి సీఎస్‌గా నియమితులు కానున్న అధికారి?
ఎప్పుడు : సెప్టెంబర్ 10
ఎవరు : డా.సమీర్ శర్మ
ఎందుకు : ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ 2021, సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనుండటంతో...