Skip to main content

Diamond Mines: రాష్ట్రంలోని ఏ జిల్లాలో వజ్రాల లభ్యత ఉన్నట్టు జీఐఎస్‌ గుర్తించింది?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వైఎస్సార్‌ కడప జిల్లా పరిధిలో పెన్నా నదీ బేసిన్‌ ప్రాంతంలో వజ్రాల లభ్యత ఉన్నట్టు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఐఎస్‌) గుర్తించింది.
Diamonds

 దేశ వ్యాప్తంగా ఖనిజాన్వేషణ సర్వే నిర్వహించిన ఈ సంస్థ జీ–4 స్థాయి పరిశోధన అనంతరం 100 మినరల్‌ బ్లాక్‌ల (గనులు) నివేదికలను సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల మైనింగ్‌ శాఖలతో ఢిల్లీలో సెప్టెంబర్‌ 8న కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆ నివేదికలను ఆయన ఆయా రాష్ట్రాలకు అందజేశారు.

37 చ.కి.మీ మేర వజ్రాల బ్లాక్‌...
మొత్తం 14 రాష్ట్రాలు మైనింగ్‌ బ్లాక్‌ నివేదికలను అందుకున్నాయి. అత్యధికంగా మధ్యప్రదేశ్‌ 21, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 9 చొప్పున నివేదికలు అందుకున్నాయి. ఏపీ తరఫున రాష్ట్ర మైనింగ్‌ డైరెక్టర్‌ వెంకటరెడ్డి నివేదికలు అందుకున్నారు. రాష్ట్రాలు ఆయా బ్లాక్‌లకు కాంపోజిట్‌ లైసెన్స్‌లు ఇచ్చేందుకు వేలం నిర్వహించాల్సి ఉంటుంది. వైఎస్సార్‌ జిల్లా ఉప్పరపల్లె ప్రాంతంలో 37.65 చదరపు కిలోమీటర్ల పరిధిలో వజ్రాల లభ్యతకు అవకాశం ఉన్నట్టు జీఐఎస్‌అన్వేషణలో తేలింది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆంధ్రప్రదశ్‌లో వజ్రాల లభ్యత ఉన్నట్టు గుర్తింపు
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 8
ఎవరు    : జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఐఎస్‌)
ఎక్కడ    : పెన్నా నదీ బేసిన్‌ ప్రాంతం, ఉప్పరపల్లె, వైఎస్సార్‌ కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం
 

Published date : 09 Sep 2021 07:09PM

Photo Stories