Skip to main content

Manohar Lal Khattar: సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా

హరియాణా ముఖ్య‌మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా చేశారు.
Manohar Lal Khattar resigns as Haryana Chief Minister

రాజీనామా లేఖను మార్చి 12వ తేదీ గవర్నర్ బండారు దత్తాత్రేయకు సమర్పించారు. సీఎంతో పాటు 13 మంది మంత్రులు గవర్నర్‌కు తమ రాజీనామా లేఖలను ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ(బీజేపీ), దుష్యంత్ చౌతాలాకు చెందిన జననాయక్‌ జనతా పార్టీ(జేజేపీ) కూటమిలో ఇబ్బందులు రావడంతో ఖ‌ట్ట‌ర్ సీఎం పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణ లోక్‌సభ స్థానం నుంచి ఖట్టర్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది. 

అసెంబ్లీలో సంపూర్ణ మోజారిటీ కలిగిన బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న‌ట్లు స‌మాచారం. ఖట్టర్ స్థానంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయాబ్ సైనీ, సంజయ్ భాటియాలకు ముఖ్య‌మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణ లోక్‌సభ స్థానం నుంచి ఖట్టర్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ సంవ‌త్స‌రం హర్యానా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి.

Haiti Prime Minister: హైతీ ప్రధాని ఏరియెల్‌ హెన్రీ రాజీనామా.. ఎందుకో తెలుసా..?

90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటకు 46 సీట్లు అవసరం. 2019 అసెంబ్లీ ఎన్నికల తరువ‌త బీజేపీకి మెజారిటీ తక్కువ రావడంతో బీజేపీ, జేజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉంది. 
జేజేపీకి 10 మంది, కాంగ్రెస్‌కు 30 మంది, ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌కు ఒక ఎమ్మెల్యే ఉన్నారు.

Published date : 13 Mar 2024 03:47PM

Photo Stories