Haryana CM: హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణం.. 13 మంత్రులు కూడా..
Sakshi Education
హర్యానా ముఖ్యమంత్రిగా బీజేపీ నేత నయాబ్ సింగ్ సైనీ ప్రమాణం చేశారు.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సైనీ చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. సైనీతో పాటు 13 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు.
అనిల్ విజ్, క్రిషన్ లాల్ పన్వార్, రావ్ నర్బీర్ సింగ్, మహిపాల్ దండా, విపుల్ గోయెల్, అరవింద్ కుమార్ శర్మ, శృతి చౌదరి, శ్యామ్ సింగ్ రాణా, రణబీర్ సింగ్ గాంగ్వా, క్రిషన్ బేడీ, గౌరవ్ గౌతమ్, ఆర్తి సింగ్ రావు, రాజేష్ నగర్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
సైనీ కంప్యూటర్ ఆపరేటర్ టు సీఎం..
- బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన సైనీ
- 1996లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా చేరిక
- మాజీ సీఎం ఖట్టర్ సాన్నిహిత్యంలో రాజకీయంగా ఎదిగిన సైనీ
- 2014లో నారాయణ్ గఢ్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నిక
- మనోహర్ లాల్ ఖట్టర్ కేబినెట్‌లో హోంమంత్రిగా సేవలు
- 2019లో కురుక్షేత్ర నుంచి లోక్‌సభకు ఎన్నిక
- 2023 అక్టోబర్‌లో హర్యానా బీజేపీ అధ్యక్షుడిగా నియామకం
- 2024 మార్చిలో హర్యానా సీఎంగా బాధ్యతలు
- 200 రోజుల్లో హర్యానా బీజేపీకి హ్యాట్రిక్ విజయంలో కీలక పాత్ర
- పుట్టిన తేదీ: 1970 జనవరి 25
- సొంతూరు అంబాల జిల్లా మిర్జాపూర్ మజ్రా గ్రామం
- బీఏ, ఎల్‌ఎల్‌బీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో సుదీర్ఘ అనుబంధం
Omar Abdullah: జమ్మూకశ్మీర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఒమర్ అబ్దుల్లా
Published date : 18 Oct 2024 09:59AM