United Nations: అంతర్జాతీయ ఉగ్రవాదిగా మక్కీ
పాకిస్థాన్ కు చెందిన కరుడుగట్టిన లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ) ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఎల్‌ఈటీలో నంబర్ 2 స్థానంలో ఉన్న మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు భారత్ సుదీర్ఘకాలంగా దౌత్యపోరాటం చేస్తోంది. ఎట్టకేలకు ఐరాస భద్రతామండలి ‘1267 ఐఎస్‌ఐఎల్(డాయిష్) అండ్ అల్‌కాయిదా శాంక్షన్స్ కమిటీ’ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొంటూ జనవరి 16న ప్రకటన విడుదల చేసింది. ఐరాస నిర్ణయంతో మక్కీపై ప్రపంచవ్యాప్తంగా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అతని ఆస్తులు ఎక్కడ ఉన్నా ఆయా దేశాలు స్తంభింపజేయాల్సి ఉంటుంది. మక్కీ విదేశాలకు వెళ్లకుండా ఆంక్షలు విధిస్తారు. ఉగ్ర కార్యకలాపాల కోసం అతడు నిధులు సేకరించకుండా నిషేధిస్తారు. ఎల్‌ఈటీ అధినేత హఫీజ్‌సయీద్‌కు మక్కీ బావమరిది.
Also read: Nuclear scientist: ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త ఏడీ దామోదరన్ కన్నుమూత