Keshub Mahindra: ఆటోమొబైల్ కింగ్ కేశుబ్ మహీంద్రా కన్నుమూత
కేశుబ్ మహీంద్రా గ్రూప్‌నకు 48 ఏళ్ల పాటు చైర్మన్‌గా వ్యవహరించారు. ఆటోమొబైల్ పరిశ్రమ నుంచి ఐటీ, రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆతిథ్యం వంటి ఇతర వ్యాపార విభాగాలకు గ్రూప్ కార్యకలాపాలను విస్తరించారు. విల్లీస్ కార్పొరేషన్, మిత్సుబిషి, ఇంటర్నేషనల్ హార్వెస్టర్, యునైటెడ్ టెక్నాలజీస్, బ్రిటీష్ టెలికం తదితర అనేక ఇతర ప్రపంచ దిగ్గజ సంస్థలతో వ్యాపార సంబంధాలను ఏర్పరచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
Mukesh Ambani: ఆసియా కుబేరుడిగా ముకేశ్ అంబానీ
అక్టోబరు 9, 1923న సిమ్లాలో జన్మించిన కేశుబ్, అమెరికా పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్‌లో గ్రాడ్యుయేట్ చేసి, 1947లో మహీంద్రా అండ్ మహీంద్రాలో చేరారు. 1963లో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. స్టీల్ ట్రేడింగ్ కంపెనీ నుంచి 15.4 బిలియన్ డాలర్ల వరకూ ఆయన పర్యవేక్షణలో గ్రూప్ వివిధ రంగాలకు విస్తరించింది. మహీంద్రా బోర్డులో డైరెక్టర్లలో ఒకరిగా 64 సంవత్సరాలు కొనసాగిన కేశుబ్ మహీంద్రా 2012లో గ్రూప్ పగ్గాలను అయన మేనల్లుడు, అప్పటి వైస్ చైర్మన్, ఎండీ ఆనంద్ మహీంద్రాకు అప్పగించారు.