Telugu film director: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
Sakshi Education
ప్రముఖ చలన చిత్ర దిగ్గజం కళాతపస్వి కె.విశ్వనాథ్ తుది శ్వాస విడిచారు.
1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించిన విశ్వనాథ్..1965లో ఆత్మగౌరవం సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. సిరిసిరి మువ్వ, శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం వంటి ఎన్నో క్లాసికల్ చిత్రాలను ఆయన తెలుగు ప్రేక్షకులకు అందించారు. సినీరంగానికి ఆయన చేసిన కృషిగానూ ఎన్నో అవార్డులను అందుకున్నారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా చలనచిత్ర రంగంలో గుర్తింపు తెచ్చుకున్న విశ్వనాథ్.. 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2016లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చింది.
Published date : 06 Feb 2023 05:22PM