50th Chief Justice of India: 50వ సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్
ఆయన పేరును సిఫార్సు చేస్తూ సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్ అక్టోబర్ 11న ఫుల్ కోర్టు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని, తర్వాత రాష్ట్రపతి ఆమోదం అనంతరం జస్టిస్ చంద్రచూడ్ సీజేఐగా నియమితులవుతారు. జస్టిస్ లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. 9న జస్టిస్ చంద్రచూడ్ సీజేఐగా ప్రమాణం చేస్తారు. 2024 నవంబర్ 10 దాకా రెండేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగుతారు.
Also read: Weekly Current Affairs (Awards) Bitbank: ఇంటర్నేషనల్ ట్రావెల్ అవార్డ్ 2023ని ఏ రాష్ట్రం గెలుచుకుంది?
ఆయన తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ కూడా సీజేఐగా చేయడం విశేషం! ఆయన 1978 నుంచి 1985 దాకా ఏకంగా ఏడేళ్ల పాటు అత్యధిక కాలం సీజేఐగా పని చేశారు. తండ్రీకొడుకులిద్దరూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.
ప్రగతిశీల భావాలున్న న్యాయమూర్తిగా పేరొందిన జస్టిస్ చంద్రచూడ్ న్యాయవాదుల కుటుంబం నుంచి వచ్చారు. 1959 నవంబర్ 11న జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్, ప్రభ దంపతులకు మహారాష్ట్రలో జన్మించారు. ముంబైలోని కేథడ్రల్, జాన్‌కానన్‌లో పాఠశాల విద్య, 1979లో ఢిల్లీలో ఆర్థిక, గణిత శాస్తాల్లో ఆనర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 1982లో ఢిల్లీలో న్యాయ పట్టా పొందారు. 1983లో హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎల్‌ఎల్‌ఎం పట్టా పొందారు. 1986లో హార్వర్డ్‌లో డాక్టరేట్ ఆఫ్ జ్యూరిడికల్ సైన్స్ చదివారు. బాంబే హైకోర్టులో, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 1998లో సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి పొందడంతోపాటు సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. 2000లో బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్విసెస్ అథారిటీ కార్యనిర్వాహక చైర్మన్‌గా ఉన్నారు. ఆయన ఇద్దరు కుమారులు అభినవ్, చింతన్ కూడా లాయర్లే.
Also read: Quiz of The Day (October 11, 2022): సముద్ర పోటు ప్రాంతాల్లో పెరిగే ముఖ్యమైన వృక్షం ఏది?
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP