Skip to main content

Grant Wahl: మ్యాచ్‌ కవర్‌ చేస్తూ ‘సాకర్‌’ జర్నలిస్ట్‌ మృతి

అమెరికాకు చెందిన ప్రముఖ క్రీడా పాత్రికేయుడు గ్రాంట్‌ వాల్‌ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆకస్మికంగా చనిపోయాడు.

ఫుట్‌బాల్‌ స్పెషలిస్ట్‌ జర్నలిస్ట్‌ అయిన గ్రాంట్‌ ప్రస్తుతం ఖతర్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌ విశేషాలను అందిస్తున్నాడు. అర్జెంటీనా, నెదర్లాండ్స్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను కవర్‌ చేస్తున్న అతను తన సీట్‌లోనే కుప్పకూలిపోయాడు. అత్యవసర వైద్య సేవలు అందించినా అతను అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. బుధవారమే తన 49వ పుట్టిన రోజు జరుపుకున్న గ్రాంట్‌ తీవ్ర అలసట, ఒత్తిడి కారణంగా అనారోగ్యంబారిన పడినట్లు సమాచారం. పలు ప్రతిష్టాత్మక మీడియా సంస్థల్లో పని చేసిన అతనికి జర్నలిస్ట్‌గా ఇది ఎనిమిదో ప్రపంచ కప్‌. టోర్నీ ఆరంభంలో హోమోసెక్సువాలిటీకి మద్దతుగా ఇంద్రధనుస్సు రంగులతో కూడిన జెర్సీతో అతను రాగా, ఖతర్‌ నిబంధనల ప్రకారం అధికారులు అభ్యంతరం చెప్పారు. ‘ఫిఫా’ ప్రత్యేకంగా సన్మానించిన జర్నలిస్ట్‌లలో అతను ఒకడు.    

Major Disasters In India : భార‌త‌దేశ చరిత్రలో జ‌రిగిన‌ పెను విషాదాలు ఇవే..

Published date : 12 Dec 2022 04:14PM

Photo Stories