New Ambassador: చైనాలో భారత కొత్త రాయబారిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
చైనాలో భారత కొత్త రాయబారిగా ప్రదీప్ కుమార్ రావత్ బాధ్యతలు స్వీకరించారు. మార్చి 14న బీజింగ్‌లోని కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారని ప్రభుత్వం తెలిపింది. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా నియమితులైన మునుపటి రాయబారి విక్రమ్ మిస్రీ స్థానంలో ఆయన నియమితులయ్యారు. 1990 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్) అధికారి అయిన రావత్.. మాండరిన్ భాషలో అనర్గళంగా మాట్లాడతారు. చైనాకు రాకముందు నెదర్లాండ్స్‌లో భారత రాయబారిగా విధులు నిర్వర్తించారు.
Aam Aadmi Party Leader: పంజాబ్ నూతన సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ కొత్త చైర్మన్ నియమితులైన వ్యక్తి?
నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ) చైర్మన్‌గా మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే నియమితులయ్యారు ఈ మేరకు ఆయన నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోద ముద్ర వేసింది. కంపెనీల చట్టం–2013 ప్రకారం.. 2018 ఏడాదిలో ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ ఏర్పాటైంది. ఇది అకౌంటింగ్ ప్రమాణాలు మరియు విధానాలను పర్యవేక్షించే ఒక స్వతంత్ర సంస్థ.
GK Awards Quiz: 'గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా' పేరుతో నీరజ్ చోప్రా జీవిత చరిత్ర ను రాసినది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : చైనాలో భారత కొత్త రాయబారిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
ఎప్పుడు : మార్చి 14
ఎవరు : ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రదీప్ కుమార్ రావత్
ఎక్కడ : బీజింగ్, చైనా
ఎందుకు : ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న విక్రమ్ మిస్రీ.. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా నియమితులైన నేపథ్యంలో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్