Aam Aadmi Party Leader: పంజాబ్ నూతన సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
పంజాబ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత భగవంత్ సింగ్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ స్వగ్రామమైన ఖట్కర్ కలన్‌లో మార్చి 16న జరిగిన కార్యక్రమంలో భగవంత్ సింగ్‌తో పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గాను ఆప్ 92 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 18 స్థానాల్లో, శిరోమణి అకాలీదళ్ 3 స్థానాల్లో, బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించగా.. బీఎస్పీ 1 సీటును కైవసం చేసుకుంది. ఇతరులు ఒక చోట గెలిచారు. సంగ్రూర్ జిల్లాలోని ధౌరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన భగవంత్ మాన్ 60వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Air India Board: ఎయిర్ ఇండియా చైర్మన్‌గా నియమితులైన వ్యక్తి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : పంజాబ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : మార్చి 16
ఎవరు : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత భగవంత్ సింగ్ మాన్
ఎక్కడ : ఖట్కర్ కలన్, షాహిద్ భగత్ సింగ్ నగర్ జిల్లా, పంజాబ్
ఎందుకు : ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం సాధించినందున..
Chairman and Managing Director: ఆయిల్ ఇండియా సీఎండీగా ఎంపికైన వ్యక్తి?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్