Indian-American: వైట్‌హౌస్ స్టాఫ్ సెక్రటరీగా నియమితులైన మహిళ?
భారత సంతతి అమెరికన్ నీరా టాండన్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే సీనియర్ అడ్వైజర్ హోదాలో ఉన్న ఆమెను వైట్‌హౌస్ స్టాఫ్ సెక్రటరీగా నియమించారు. అధ్యక్ష భవనం స్టాఫ్ సెక్రటరీగా అధికార యంత్రాంగం, ఫెడరల్ ప్రభుత్వం నుంచి అధ్యక్షుడికి అందే అన్ని రకాల ఫైళ్ల బాధ్యతలను 51 ఏళ్ల నీరా పర్యవేక్షించాల్సి ఉంటుంది. వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రాన్ క్లెయిన్‌కు ఆమె తన విభాగం తరఫున నివేదికలను అందజేస్తారు. ఈ నియామకానికి సెనేట్ ఆమోదం అవసరం లేదు.
చదవండి: ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : వైట్‌హౌస్ స్టాఫ్ సెక్రటరీగా నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 23
ఎవరు : భారత సంతతి అమెరికన్ నీరా టాండన్
ఎందుకు : అమెరికా అధ్యక్షుడికి అందే అన్ని రకాల ఫైళ్ల బాధ్యతలను పర్యవేక్షించేందుకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్