Olaf Scholz: భారత్‌లో జర్మనీ అధ్యక్షుడు పర్యటన
Sakshi Education
జర్మనీ అధ్యక్షుడు ఒలాఫ్ షోల్జ్ ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు.
ఏడాది క్రితం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షోల్జ్ భారత్ రానుండటం ఇదే మొదటిసారి. సీనియర్ అధికారులు, ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి వర్గంతో 25న ఆయన ఢిల్లీకి చేరుకుంటారని విదేశాంగ శాఖ తెలిపింది. షోల్జ్, ప్రధాని మోదీ పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. 26న బెంగళూరులో జరిగే కార్యక్రమాల్లో జర్మనీ అధ్యక్షుడు షోల్జ్ పాల్గొంటారు. అదేవిధంగా, ఆ్రస్టేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ కూడా మార్చి 8వ తేదీన భారత్‌లో పర్యటనకు రానున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, కీలక ఖనిజాలు తదితర అంశాలపై ఆయన ప్రధాని మోదీతో విస్తృత చర్చలు జరుపుతారు. ఇరువురు నేతలు కలిసి అహ్మదాబాద్‌లో జరిగే భారత్–ఆ్రస్టేలియా క్రికెట్ మ్యాచ్‌ను తిలకించనున్నారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (22-28 జనవరి 2023)
Published date : 21 Feb 2023 01:14PM