Beijing: ఏఐఐబీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన ఆర్‌బీఐ మాజీ గవర్నర్?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. దీంతో ఏఐఐబీలోని ఐదుగురు ఉపాధ్యక్షుల్లో ఉర్జిత్ పటేల్ ఒకరు కానున్నారు. ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న డీజే పాండ్యన్ స్థానంలో ఉర్జిత్ పటేల్ బాధ్యతలు చేపట్టనున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. బీజింగ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఏఐఐబీ ప్రెసిడెంట్‌గా ప్రస్తుతం చైనా ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన జిన్ లిక్వన్ ఉన్నారు.
ఉర్జిత్ పటేల్.. 2016, సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 2018, డిసెంబర్ 10వ తేదీ వరకు ఆర్‌బీఐ 24వ గవర్నర్‌గా పనిచేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా పదవీకాలం ముగియకముందే తన పదవికి రాజీనామా చేశారు.
చదవండి: జైలు శిక్ష విధింపబడిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) ఉపాధ్యక్షుడిగా నియామకం
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్
ఎక్కడ : బీజింగ్, చైనా
ఎందుకు : ప్రస్తుతం ఏఐఐబీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న డీజే పాండ్యన్ పదవీ కాలం ముగియడంతో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్