Myanmar': జైలు శిక్ష విధింపబడిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత?
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, పదవీచ్యుత నేత అంగ్‌సాన్ సూకీ(76)కి మరో నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ మయన్మార్‌లోని ఓ కోర్టు జనవరి 10న తీర్పు వెలువరించింది. చట్టవిరుద్ధంగా దేశంలోకి వాకీటాకీలను దిగుమతి చేసుకోవడంతోపాటు, కోవిడ్ ఆంక్షలను ధిక్కరించిన కేసుల్లో కోర్టు ఆమెను దోషిగా తేల్చిందని న్యాయశాధికారులు తెలిపారు. 2021, డిసెంబర్‌లో వివిధ నేరాలకు పాల్పడ్డారంటూ కోర్టు సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించగా మిలటరీ పాలకులు ఆ శిక్షను రెండేళ్లకు తగ్గించిన విషయం విదితమే.
100 ఏళ్లకు పైగానే..
సూకీ సారథ్యంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ ఐదేళ్ల కాలానికి రెండో విడత గెలవగానే 2021, ఫిబ్రవరిలో సైనిక నేతలు తిరుగుబాటు చేశారు. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారని సూకీతోపాటు పలువురు కీలక నేతలపై ఆరోపణలు చేస్తూ వారిని పదవుల నుంచి తొలగించి, నిర్బంధంలో ఉంచారు. అనంతరం సూకీతోపాటు ఇతరులపై న్యాయస్థానాల్లో విచారణ ప్రారంభించారు. సూకీ ఎదుర్కొంటున్న మరికొన్ని ఆరోపణలకు సంబంధించి త్వరలో కోర్టు తీర్పు వెలువడనుంది. ఇవికాకుండా, మిగతా ఆరోపణలు కూడా రుజువైతే ఆమెకు 100 ఏళ్లకు పైగానే జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి.
చదవండి: సల్లి డీల్స్ యాప్ సృష్టికర్త ఎవరు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : జైలు శిక్ష విధింపబడిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత?
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : మయన్మార్ పదవీచ్యుత నేత అంగ్‌సాన్ సూకీ(76)
ఎక్కడ : మయన్మార్
ఎందుకు : చట్టవిరుద్ధంగా దేశంలోకి వాకీటాకీలను దిగుమతి చేసుకోవడంతోపాటు, కోవిడ్ ఆంక్షలను ధిక్కరించినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్