Manmohan Singh: 33 ఏళ్ల పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగిన మన్మోహన్ సింగ్.. ముగిసిన పదవీకాలం
ఈయనతో పాటు తొమ్మిది మంది కేంద్రమంత్రులు, 44 మంది ఇతరులు కూడా రాజ్యసభకు వీడ్కోలు పలికారు.
➤ మన్మోహన్ సింగ్ దివంగత ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు నేతృత్వంలో ఆర్థిక సంస్కరణలను పట్టాలెక్కించారు. అలాగే పది సంవత్సరాలు(2004-2014) ప్రధానమంత్రిగా పనిచేశాడు.
➤ 1991 అక్టోబర్ 1వ తేదీ అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికై, 2019 జూన్ 14వ తేదీ వరకు ఎగువ సభలో ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు.
➤ 2019 ఆగస్టు 20వ తేదీ రాజస్థాన్ నుంచి తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యాడు.
➤ ఈయన పంజాబ్ యూనివర్సిటీలో, దిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో అధ్యాపకుడిగా పనిచేశాడు.
➤ 1971లో కేంద్ర వాణిజ్యశాఖకు ఆర్థిక సలహాదారుగా నియమితులై తొందరలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రధాన సలహాదారుడయ్యాడు.
➤ అలాగే ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా, ఆర్బీఐ గవర్నర్‌గా, ప్రధాన మంత్రికి సలహాదారుగా, యూజీసీ ఛైర్మన్‌గా పనిచేశాడు.
Forbes Richest Billionaires: ప్రపంచ కుబేరుల జాబితాలో మన తెలుగువాళ్లు, వీళ్ల ఆస్తుల లెక్కలు చూస్తే..