Former CBDT Chairman: రాజ్యసభ నూతన సెక్రెటరీ జనరల్‌గా నియమితులైన వ్యక్తి?
రాజ్యసభ నూతన సెక్రెటరీ జనరల్‌గా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) మాజీ చైర్మన్ ప్రమోద్ చంద్ర మోదీ(పీసీ మోదీ) నియమితులయ్యారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులపై రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతకం చేశారు. దీంతో తెలుగు వ్యక్తి డాక్టర్ పరాశరం పట్టాభి కేశవ రామాచార్యులు స్థానంలో పీసీ మోదీ బాధ్యతలు చేపట్టనున్నారు.
మహారాష్ట్రకు నాయకత్వ పురస్కారం...
పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నందుకు మహారాష్ట్రకు ‘స్ఫూర్తిదాయక ప్రాంతీయ నాయకత్వం’ పురస్కారం లభించింది. స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గోలో జరుగుతున్న కాప్–26 సమావేశాల సందర్భంగా మహారాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే అవార్డును స్వీకరించారు. ‘అండర్2 కొయిలేషన్’ అనే సంస్థ దీన్ని బహూకరించింది. ‘మాఝీ వసుంధర’ అనే కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణలో రాష్ట్ర ప్రజలు అందర్నీ భాగస్వామ్యం చేస్తున్నందుకు ఈ పురస్కారం లభించింది.
చదవండి: దక్షిణాఫ్రికాకు చివరి శ్వేతజాతి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాజ్యసభ నూతన సెక్రెటరీ జనరల్‌గా నియామకం
ఎప్పుడు : నవంబర్ 8
ఎవరు : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) మాజీ చైర్మన్ ప్రమోద్ చంద్ర మోదీ(పీసీ మోదీ)
ఎందుకు : రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిర్ణయం మేరకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్