Uttarakhand Governor: ఉత్తరాఖండ్ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన ఆర్మీ అధికారి?
ఇటీవలే ఉత్తరాఖండ్ గవర్నర్‌గా ఉన్న మౌర్య రాజీనామా చేయడంతో ఆ స్థానంలో రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్‌ను నియమించారు. 2016 ఏడాదిలో గుర్మిత్ సింగ్ నుంచి రిటైరయ్యారు. చైనాతో మిలటరీ వ్యవహారాల్లో ఆయన అనుభవజ్ఞుడు.
తమిళనాడు గవర్నర్‌గా ఆర్‌ఎన్ రవి...
ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా ఉన్న బన్వరిలాల్ పురోహిత్‌ను పంజాబ్ గవర్నర్‌గా రాష్ట్రపతి కోవింద్ నియమించారు. ఇప్పటివరకు ఆయన పంజాబ్ గవర్నర్ బాధ్యతలు అదనంగా పర్యవేక్షిస్తున్నారు. నాగాలాండ్ గవర్నర్‌గా ఉన్న మాజీ ఐపీఎస్ ఆర్‌ఎన్ రవిని తమిళనాడు గవర్నర్‌గా నియమించారు. అసోం గవర్నర్ జగదీశ్ ముఖికి నాగాలాండ్ బాధ్యతలు అదనంగా అప్పగించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉత్తరాఖండ్ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన ఆర్మీ అధికారి?
ఎప్పుడు : సెప్టెంబర్ 9
ఎవరు : రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్
ఎందుకు : ఉత్తరాఖండ్ గవర్నర్‌గా ఉన్న బేబీ రాణి మౌర్య రాజీనామా చేసిన నేపథ్యంలో....