Skip to main content

Nagaland Election 2023: నాగాలాండ్‌లో తొలిసారిగా మహిళా ఎమ్మెల్యేల గెలుపు

నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికలు సరికొత్త చరిత్రను లిఖించాయి. 60 ఏళ్ల తర్వాత ఆ రాష్ట్రంలో ఇద్దరు మహిళలు తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు.
First time women MLA wins in Nagaland

తాజాగా వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్‌ డీపీపీ అభ్యర్థులు హెకానీ జఖాలు, సాలూహ్టువోనో క్రూజ్‌ దిమాపూర్, పశ్చిమ అంగామీ నియోజక వర్గాల నుంచి గెలుపొందారు. నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మొదటి మహిళలుగా వీరు రికార్డు సృష్టించారు. నేషనల్‌ డెమొక్రాటిక్‌ ప్రాగ్రెసివ్‌ పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 10 Mar 2023 05:26PM

Photo Stories