EP: యూరోపియన్ పార్లమెంట్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
యూరోపియన్ పార్లమెంట్(ఈపీ) అధ్యక్షుడు డేవిడ్ మరియా సస్సోలీ(65) కన్నుమూశారు. ఇటలీలోని ఏవియానో పట్టణంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనవరి 11న తుదిశ్వాస విడిచారు. రోగనిరోధక వ్యవస్థ దెబ్బతిని తీవ్ర అనారోగ్యానికి గురైన సస్సోలీ... 2021, డిసెంబరు 26న ఆసుపత్రిలో చేరారు. రెండు వారాలకుపైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇటలీకి చెందిన సస్సోలీ 2009లో తొలిసారి యూరోపియన్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. మరోమారు 2014లో గెలుపొందారు. 2019, జూలై 3వ తేదీ నుంచి యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడిగా సేవలందించారు.
1952, సెప్టెంబర్ 10న ఏర్పాటైన యురోపియన్ పార్లమెంట్ ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బోర్గ్‌లో ఉంది. 450 మిలియన్ల మంది ప్రజలకు ఇది ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇందులోని సభ్య దేశాలు 700 మంది సభ్యులను ఎన్నుకుంటాయి.
పద్మశ్రీ టి.వి. నారాయణ కన్నుమూత
స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త, సామాజికవేత్త, కవి, రచయిత పద్మశ్రీ డాక్టర్ టి.వి.నారాయణ (97) మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన స్వగృహంలో జనవరి 11న తుదిశ్వాస విడిచారు. తెలంగాణ నుంచి సాహితీవేత్తగా ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. బడుగు వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన ఆయన ఎందరో రాజకీయనాయకులు, విద్యావేత్తలకు ఆయన గురువు.
చదవండి: ఏఐఐబీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన ఆర్‌బీఐ మాజీ గవర్నర్?
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూరోపియన్ పార్లమెంట్(ఈపీ) అధ్యక్షుడు కన్నుమూత
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : డేవిడ్ మరియా సస్సోలీ(65)
ఎక్కడ : ఏవియానో, ఇటలీ
ఎందుకు : రోగనిరోధక వ్యవస్థ దెబ్బతిని తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్