Skip to main content

Uttarakhand Governor: ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ పదవికి రాజీనామా చేసిన వారు?

ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ బేబీ రాణి మౌర్య (65) తన పదవికి రాజీనామా చేశారు.
Baby Rani Maurya

రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కి పంపినట్లు రాష్ట్రపతిభవన్‌ అధికారులు సెప్టెంబర్‌ 8న వెల్లడించారు. గవర్నర్‌గా మరో రెండేళ్ల పదవీ కాలం మిగిలి ఉండగానే ఆమె రాజీనామా చేయడం గమనార్హం. రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకే మౌర్య రాజీనామా చేశారని వార్తలు వెలువడుతున్నాయి. బీజేపీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న మౌర్య 2018 ఆగస్టు 26న ఉత్తరాఖండ్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆగ్రాకు తొలి మహిళా మేయర్‌గా పనిచేసిన (1995–2000 మధ్య) ఘనత కూడా ఆమె సాధించారు. 2002–2005 మధ్య జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా పనిచేశారు.

యూఎస్, యూకే, రష్యాతో భారత్‌ చర్చలు
తాలిబన్లతో పాటు అఫ్గాన్‌లో ఇతర టెర్రరిస్టు గ్రూపులతో పాకిస్తాన్‌కు ఉన్న సంబంధాలపై యూఎస్, యూకే, రష్యాలకు భారత్‌ తన ఆందోళన తెలియజేసింది. ఇటీవల కొద్ది రోజుల వ్యవధిలో యూఎస్‌ సీఐఏ అధినేత విలయం బర్న్స్, యూకే ఎం16 అధిపతి రిచర్డ్‌ మూరే, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌ కార్యదర్శి నికోలాయ్‌ పట్రుషెవ్‌లు భారత్‌లో పర్యటించారు. వీరితో జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోవల్‌ చర్చలు జరిపారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ పదవికి రాజీనామా
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 8
ఎవరు    :  బేబీ రాణి మౌర్య 
ఎందుకు   : వ్యక్తిగత కారణాల వల్ల...
 

Published date : 09 Sep 2021 06:51PM

Photo Stories