Aam Aadmi Party: ఆప్ జాతీయ కన్వీనర్‌గా ఎన్నికైన ముఖ్యమంత్రి?
సెప్టెంబర్ 12న వర్చువల్‌గా నిర్వహించిన పార్టీ జాతీయ కార్యనిర్వహక సమావేశంలో కేజ్రీవాల్‌ను జాతీయ కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. అలాగే ఆప్ జాతీయ కార్యదర్శిగా పంకజ్ గుప్తా, జాతీయ కోశాధికారిగా ఎన్.డి.గుప్తా ఎన్నికయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీని 2012, నవంబర్ 26నలో అరవింద్ కేజ్రివాల్ స్థాపించారు. ప్రస్తుతం ఢిల్లీలో అధికారంలో కొనసాగుతోంది..
అల్ జవహిరి మళ్లీ ప్రత్యక్షమయ్యాడు..
కొద్ది నెలల క్రితమే మరణించాడని భావిస్తున్న అల్ కాయిదా చీఫ్ అయమాన్ అల్ జవహిరి తిరిగి ప్రత్యక్షమయ్యాడు. అమెరికాపై అల్‌కాయిదా దాడులు జరిపి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా(11/09) సెప్టెంబర్ 11న అల్‌కాయిదా విడుదల చేసిన ఓ వీడియోలో ఆయన కనిపించాడు. వీడియోలో అయమాన్ అల్ జవహిరి జెరూసలేం గురించి, జనవరిలో రష్యన్ బలగాలపై సిరియాలో జరిగిన దాడుల గురించి, అమెరికా బలగాలు అఫ్గాన్ నుంచి వెళ్లిపోవడం గురించి ప్రస్తావించాడు. 2011లో ఒసామాను అమెరికా హతం చేసిన అనంతరం ఈజిప్టుకు చెందిన నేత అయమాన్ అల్ జవహిరి ఆల్‌కాయిదా చీఫ్‌గా మారాడు.
చదవండి: భారత కాగ్ జీసీ ముర్ము ఏ అంతర్జాతీయ సంస్థ చైర్మన్‌గా ఎంపికయ్యారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)జాతీయ కన్వీనర్‌గా ఎన్నికైన ముఖ్యమంత్రి?
ఎప్పుడు : సెప్టెంబర్ 12
ఎవరు : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
ఎందుకు : పార్టీ కార్యకలాపాల నిర్వహణ కోసం...