Telangana: ఏసీబీ డీజీగా అంజనీకుమార్
Sakshi Education
తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌గా అంజనీకుమార్ బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో జనవరి 26వ తేదీన బాధ్యతలు స్వీకరించారు.
ఏసీబీ డీజీగా పనిచేసిన పూర్ణచందర్‌రావు ఉద్యోగ విరమణతో సీఐడీ డీజీ గోవింద్ సింగ్‌కు ప్రభుత్వం ఏసీబీ అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఏసీబీ పూర్తి స్థాయి డీజీగా అంజనీకుమార్‌ను నియమించడంతో గోవింద్ సింగ్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. నగర కమిషనర్ బాధ్యతలను సైతం అంజనీకుమార్ నూతన సీపీ సీవీ ఆనంద్‌కు అప్పగించారు.
Published date : 27 Dec 2021 06:38PM