Youngest Woman Pilot: విమానంలో ప్రపంచాన్ని చుట్టొచ్చిన పిన్నవయస్కురాలు?
అతిపిన్న వయసులో విమానంలో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టొచ్చిన పిన్నవయస్కురాలిగా 19 ఏళ్ల బెల్జియన్–బ్రిటిష్ పైలట్ జారా రూథర్‌ఫర్డ్ రికార్డు నెలకొల్పింది. బెల్జియంలోని కోర్ట్‌రైలో ఓ చిన్న విమాన స్థావరం నుంచి 155 రోజుల క్రితం తన సాహసయాత్రకు శ్రీకారం చుట్టిన ఆమె.. ఏకంగా 52 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి మళ్లీ సురక్షితంగా జనవరి 20న కోర్ట్‌రైకి చేరుకున్నారు. దీంతో అతిచిన్న వయసులో ఒంటరిగా విమానంలో ప్రపంచాన్ని చుట్టొచ్చిన మహిళగా రికార్డు సొంతం చేసుకున్నారు. ఈ మేరకు ఆమె పేరు గిన్నిస్ పుస్తకంలోకి ఎక్కనుంది. ఇప్పటివరకు ఈ రికార్డు అమెరికాకు చెందిన శేష్టా వైజ్ పేరు మీద (30 ఏళ్ల వయసులో) ఉంది. మహిళలు విమానయాన రంగంలోకి వచ్చేలా ప్రోత్సహించడానికి ఈ సాహస యాత్రను చేపట్టినట్లు జారా తెలిపింది. ఐదు ఖండాల్లోని 41 దేశాలను సందర్శించిన జారా.. మొత్తం 52 వేల కిలోమీటర్లు ప్రయాణం చేశారు.
చదవండి: ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన అధికారి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : అతిపిన్న వయసులో విమానంలో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టొచ్చిన పిన్నవయస్కురాలిగా రికార్డు
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : 19 ఏళ్ల బెల్జియన్–బ్రిటిష్ పైలట్ జారా రూథర్‌ఫర్డ్
ఎక్కడ : కోర్ట్‌రై, బెల్జియం
ఎందుకు : మహిళలు విమానయాన రంగంలోకి వచ్చేలా ప్రోత్సహించడానికి..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్