IAS Officer: ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన అధికారి?
పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్‌ఐ) డైరెక్టర్ జనరల్ అధర్ సిన్హాను పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. వెయిటింగ్‌లో ఉన్న సీనియర్ ఐఏఎస్ ఎ.వాణీప్రసాద్‌ను ఈపీటీఆర్‌ఐ కొత్త డైరెక్టర్ జనరల్‌గా నియమించింది. ఈ మేరకు పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జనవరి 20న ఉత్తర్వులు జారీచేశారు. ఈపీటీఆర్‌ఐ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉంది.
తరోన్ కోసం పీఎల్‌ఏ సాయం కోరిన ఆర్మీ
అరుణాచల్‌ప్రదేశ్‌లో గల్లంతైన మిరమ్ తరోన్(17) ఆచూకీ కోసం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) సాయాన్ని భారతీయ ఆర్మీ జనవరి 20న కోరింది. నియమాల ప్రకారం తరోన్ చైనా భూభాగంలో ఉంటే గుర్తించి అప్పగించాలని పీఎల్‌ఏను ఆర్మీ కోరిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని అప్పర్ సియాంగ్ జిల్లా నుంచి తరోన్‌ను జనవరి 18న పీఎల్‌ఏ మాయం చేసిందని ఆ రాష్ట్ర ఎంపీ తపీర్ గావో ఆరోపించారు. మూలికల అన్వేషణ, జంతువుల వేట కోసం తరోన్ ఇంటినుంచి వెళ్లి మరలా తిరిగిరాలేదు
క్విక్ రివ్యూ :
ఏమిటి : పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్‌ఐ) డైరెక్టర్ జనరల్‌గా నియామకం
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : ఐఏఎస్ ఎ.వాణీప్రసాద్
ఎక్కడ : గచ్చిబౌలి, హైదరాబాద్
ఎందుకు : పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీల నేపథ్యంలో..