Women Reservation Bill passed in Parliament : మహిళా రిజర్వేషన్ బిల్లుకి లోక్‌సభ ఆమోదం.. కీలక వివరాలు ఇవే..
అయితే.. ఇది పెద్దల సభలోనూ ఆమోదం పొందినా.. రిజర్వేషన్ కోటా అమలు అయ్యేది మాత్రం 2029 ఎన్నికల సమయంలోనేనని కేంద్రం స్పష్టం చేసింది. అంతకు ముందు జనాభా లెక్కలు, డీ లిమిటేషన్ ప్రక్రియ జరగాల్సి ఉంటుంది.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు.. ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఆమోదం లభించింది. బిల్లుకు మెజార్టీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఓటింగ్ సమయంలో 456 మంది సభ్యులు సభలో ఉన్నారు. అనుకూలంగా 454 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 2 ఓట్లు వచ్చాయి. ఎంఐఎం ఎంపీలిద్దరూ వ్యతిరేకంగా ఓటేశారు.
2024 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తించదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఎన్నికల తర్వాత జనాభా లెక్కలు, డీలిమిటేషన్ చేపడతామని పేర్కొన్నారు. కావాలంటే బిల్లులో కొన్ని మార్పులు కూడా చేపడతామని పేర్కొన్నారు. అమిత్ షా మాట్లాడుతుండగానే సభ నుంచి రాహుల్ గాంధీ బయటకు వెళ్లిపోయారు.
లోక్‌సభలో సోనియా గాంధీ మాట్లాడుతూ..
మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేం మద్దతు ఇస్తాం. వంటింటి నుంచి ప్రపంచ వేదికల వరకు భారత మహిళల పాత్ర ఎంతో ఉంది. మహిళలు వారి స్వార్థం గురించి ఏనాడు ఆలోచించరు. స్త్రీల త్యాగాలు ఎనలేనివి. ఆధునిక భారత నిర్మాణంలో పురుషులతో కలిసి స్త్రీలు పోరాడారు. సరోజినీ నాయుడు, సుచేత కృపాలనీ, ఆరుణాసఫ్ అలీ, విజయలక్ష్మీ పండిట్ వంటి వారెందరో దేశం కోసం పోరాడారు.
☛ ఈ బిల్లు కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లు రాజీవ్ గాంధీ కల. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని నిర్ణయించేందుకు తొలిసారిగా రాజ్యాంగ సవరణ చేస్తూ రాజీవ్ గాంధీ బిల్లును తీసుకొచ్చారు.
☛ India's Name Changing To Bharat : భారత్ వెనుక ఉన్న రహస్యం ఇదేనా..?
☛ పీఎం పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యసభలో ఆమోదించింది. ఫలితంగా స్థానిక సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా 15 లక్షల మంది మహిళా నేతలు ఎన్నికయ్యారు. దీంతో, రాజీవ్ గాంధీ కల పాక్షికంగా మాత్రమే పూర్తయింది. ఈ బిల్లు ఆమోదంతో అది పూర్తవుతుంది.
☛ గతంలో బీజేపీ సభ్యులు మహిళా బిల్లును అడ్డుకున్నారు. ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది. కానీ, మాకు ఒక భయం ఉంది. ఇప్పటి వరకు 13 ఏళ్లుగా మహిళలు బిల్లు అమలు కోసం వేచిచూస్తున్నారు. ఇంకెన్నాళ్లు మహిళలు వేచిచూడాలి. వెంటనే కులగణన చేసి మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలి’ అని డిమాండ్ చేశారు.
డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ..
మహిళా బిల్లును బీజేపీ రాజకీయంగా వాడుకుంటోంది. దేశంలోనే తొలిసారిగా 1921లో తమిళనాడు మహిళ ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నాం. వందేళ్ల తర్వాత ఇప్పటికీ మహిళలకు రిజర్వేషన్లు అమలు కాలేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో రాజ్యసభలో మహిళా బిల్లును ఆమోదించారు.
మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ..
2010లో మేము బిల్లును రాజ్యసభలో ఆమోదించాము. కానీ లోక్‌సభ ఆమోదించడంలో విఫలమైంది. అందుకే, ఇది కొత్త బిల్లు కాదు. ఆ బిల్లును ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఈ రోజుకి త్వరగా పూర్తయ్యేది. బీజేపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రచారం చేస్తున్నారని నేను భావిస్తున్నాను. కానీ, నిజానికి డీలిమిటేషన్ లేదా జనాభా లెక్కలు జరిగితే తప్ప బిల్లు సాధ్యం కాదు. ఈ బిల్లుకు మేము పూర్తిగా సహకరిస్తాం. ఈ బిల్లులో లొసుగులు, లోపాలను సరిదిద్దాలన్నారు.
☛ GK : తొలిసారిగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన రాష్ట్రపతి ఎవరు..?