Skip to main content

Unicorn Start-Ups: అత్యధిక యూనికార్న్‌ స్టార్టప్‌లు ఉన్న దేశాల్లో భారత్‌ స్థానం?

బెంగళూరుకు చెందిన నియో బ్యాంకింగ్‌ స్టార్టప్‌ ‘‘ఓపెన్‌’’ యూనికార్న్‌ హోదా సాధించిన వందో భారతీయ స్టార్టప్‌గా గుర్తింపు సాధించింది. ఒక స్టార్టప్‌ విలువ ఒక బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు చేరితే దానిని యూనికార్న్‌ స్టార్టప్‌ అంటారు. ప్రస్తుతం అత్యధిక యూనికార్న్‌ స్టార్టప్‌లు ఉన్న దేశాల జాబితాలో అమెరికా, చైనాల తర్వాతి స్థానంలో భారత్‌(మూడో స్థానం) ఉంది.

GK Sports Quiz: 2022 మయామి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళా సింగిల్స్ టైటిల్‌ విజేత‌?

జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తి
కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తయింది. డీలిమిటేషన్Œ కమిషన్Œ  తన పదవీ కాలం ముగియడానికి ఒకరోజు ముందే పని పూర్తి చేసింది. రిటైర్డ్‌ జస్టిస్‌ రంజనా దేశాయ్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిషన్ ఈ నివేదిక సమర్పించింది. జమ్మూ కశ్మీర్‌లోని అసెంబ్లీస్థానాల సంఖ్యను 83 నుంచి 90 సీట్లకు పెంచాలని కమిష¯Œ ప్రతిపాదించింది. జమ్మూలో 6 స్థానాలు, కశ్మీర్‌లో ఒక స్థానం కమిషన్ అదనంగా ప్రతిపాదించింది. చరిత్రలోనే తొలిసారి షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌కు 9 సీట్లు కేటాయించింది. నియోజకవర్గాల సంఖ్య, విస్తీర్ణం వంటి వివరాలతో కూడిన గెజిట్‌ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఆర్డర్‌ కాపీ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.
Life Expectancy: దేశంలో ఏ రాష్ట్ర ప్రజల ఆయుష్షు అత్యధికంగా ఉంటుంది?​​​​​​​

​​​​​​​క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అత్యధిక యూనికార్న్‌ స్టార్టప్‌లు ఉన్న దేశాల్లో మూడో స్థానంలో ఉన్న దేశం?
ఎప్పుడు  : మే 06
ఎవరు    : భారత్‌ 
ఎక్కడ    : ప్రపంచంలో..
ఎందుకు : తాజాగా బెంగళూరుకు చెందిన నియో బ్యాంకింగ్‌ స్టార్టప్‌ ‘‘ఓపెన్‌’’ యూనికార్న్‌ హోదా సాధించిన వందో భారతీయ స్టార్టప్‌గా గుర్తింపు పొందడంతో..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 10 May 2022 01:41PM

Photo Stories