Skip to main content

Cheetahs: నమీబియా నుంచి వచ్చిన చీతాల కోసం టాస్క్‌ఫోర్స్‌

Cheetahs

ఇటీవల నమీబియా నుంచి తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో అంతర్జాతీయ పార్కులో వదిలిన చీతాల పర్యవేక్షణకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. పార్క్‌తోపాటు సమీప ఇతర అనువైన నిర్దేశిత ప్రాంతాల్లో చీతాలను ఈ బృందం పర్యవేక్షిస్తుంది. మధ్యప్రదేశ్‌ అటవీ, పర్యాటక శాఖల ముఖ్య కార్యదర్శులతో కూడిన ఈ తొమ్మిది మంది సభ్యుల బృందానికి నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ సహకరిస్తుంది. కొత్త ప్రాంతాన్ని చీతాలు ఏ మేరకు సొంతస్థలంగా భావిస్తాయి, చీతాల ఆరోగ్య స్థితి సమీక్షించడం, వేట నైపుణ్యాలను పరిశీలించడమే లక్ష్యంగా ఈ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటైంది. బృందం చేపట్టాల్సిన ఇతరత్రా పనులను మంత్రిత్వశాఖ నిర్దేశించింది. రెండేళ్లపాటు టాస్క్‌ఫోర్స్‌ ఈ ప్రత్యేక విధుల్లో నిమగ్నమై ఉంటుంది.

September Weekly Current Affairs (National) Bitbank: Against which crime CBI launched Operation 'Megh Chakra'?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 21 Oct 2022 01:41PM

Photo Stories