Supreme Court: ఎకో–సెన్సిటివ్ జోన్ లపై ‘సుప్రీం’ కీలక ఆదేశాలు
అడవుల పరిరక్షణ కోసం మైనింగ్, పరిశ్రమల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ పార్కులకు కిలోమీటర్ పరిధిలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలను నిషేధించింది. దేశవ్యాప్తంగా ఎకో–సెన్సిటివ్ జోన్ లు(ఈఎస్‌జెడ్ పర్యావరణ సున్నిత మండలాలు), వాటి పరిసరాల్లో కార్యకలాపాలను నియంత్రించడంపై తాజాగా ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ మేరకు బఫర్‌జోన్ కు కిలోమీటర్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు ఉండరాదని స్పష్టం చేసింది. ఈ జోన్ ల వెంబడి జరుగుతున్న కార్యకలాపాలు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనుమతితో మాత్రమే కొనసాగుతాయని కోర్టు తీర్పు స్పష్టం చేసింది. అలాగే ప్రతి రాష్ట్రం తరపున చీఫ్ కన్జర్వేటర్.. ఈఎస్‌జెడ్ హోదా కింద వచ్చే నిర్మాణాల జాబితాను సిద్ధం చేసి.. మూడు నెలల్లో సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే వన్యప్రాణుల అభయారణ్యాలు,జాతీయ ఉద్యాన వనాలలో ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు ఉండరాదని పేర్కొంది.
Supreme Court: జీఎస్టీ మండలి సిఫార్సులపై సుప్రీం ఆదేశాలు