Amit Shah: దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం ఎక్కడ జరిగింది?
ఆద్మాత్మిక నగరి తిరుపతిలో దక్షిణ రాష్ట్రాల ప్రాంతీయ మండలి (సదరన్ జోనల్ కౌన్సిల్) 29వ సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన నవంబర్ 14న జరిగిన ఈ సమావేశంలో ఎనిమిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు పాల్గొన్నారు. సమావేశంలో అపరిష్కృత అంశాలతోపాటు పలు సమస్యల పరిష్కారాలపై చర్చలు జరిపారు. ఆయా రాష్ట్రాల/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు తమ వాదనలు వినిపించారు.
40 అంశాలకు పరిష్కారం..
తాజా భేటీ సందర్భంగా సదరన్ జోనల్ కౌన్సిల్‌కు సంబంధించి మొత్తం 51 పెండింగ్ అంశాలకుగాను 40 అంశాలను పరిష్కరించామని హోం మంత్రి అమిత్‌షా తెలిపారు. దక్షిణ భారత రాష్ట్రాల ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు దేశాన్ని సుసంపన్నం చేశాయని పేర్కొన్నారు. సమావేశాల్లో తెలంగాణ గవర్నర్–పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, పుదుచ్చేరి సీఎం రంగసామి పాల్గొన్నారు.
చదవండి: ఫార్మా రంగ ఆవిష్కరణల తొలి శిఖరాగ్ర సదస్సు
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన దక్షిణ రాష్ట్రాల ప్రాంతీయ మండలి (సదరన్ జోనల్ కౌన్సిల్) 29వ సమావేశం
ఎప్పుడు : నవంబర్ 14
ఎక్కడ : తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : అపరిష్కృత అంశాలతోపాటు పలు సమస్యల పరిష్కారాలపై చర్చలు జరిపేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్