Skip to main content

British-era Tunnel: ఏ రాష్ట్రం/యూటీ అసెంబ్లీలో బ్రిటిష్‌ కాలం నాటి సొరంగాన్ని కనుగొన్నారు?

కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ అసెంబ్లీలో ఉన్న బ్రిటిష్‌ కాలం నాటి సొరంగం, ఎగ్జిక్యూటివ్‌ రూమ్‌లలోకి 2022 ఏడాది జనవరి 26కుగానీ లేదా ఆగస్టు 15కు గానీ ప్రజలకు ప్రవేశం కల్పిస్తామని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ రామ్‌ నివాస్‌ గోయల్‌ సెప్టెంబర్‌ 3న తెలిపారు.
delhiassembly-Tunnel


2016లో ఈ సొరంగాన్ని, ఎగ్జిక్యూటివ్‌ రూమ్‌ను కనుగొన్న సంగతి తెలిసిందే. 1911లో ఢిల్లీ అసెంబ్లీ భవన నిర్మాణం జరిగింది. ఈ సొరంగం ద్వారా ఎర్రకోట వద్దకు (5–6 కి.మీ) చేరే అవకాశం అప్పట్లో ఉండేదని భావిస్తున్నట్లు రామ్‌ నివాస్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్‌ రూమ్‌ వద్ద పునర్నిర్మాణం జరుగుతోందని తెలిపారు. అయితే ఎర్ర కోట వరకూ సొరంగాన్ని తవ్వబోవడం లేదని అన్నారు. దేశ రాజధాని 1912లో కోల్‌కతా నుంచి ఢిల్లీకి మారినప్పుడు ఈ భవనాన్నే అసెంబ్లీగా ఉపయోగించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : బ్రిటిష్‌ కాలం నాటి సొరంగం, ఎగ్జిక్యూటివ్‌ రూమ్‌లలోకి 2022 ఏడాది జనవరి 26కుగానీ లేదా ఆగస్టు 15కు గానీ ప్రజలకు ప్రవేశం కల్పిస్తాం
ఎప్పుడు    : సెప్టెంబర్‌ 3
ఎవరు    : ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ రామ్‌ నివాస్‌ గోయల్‌
ఎక్కడ    : ఢిల్లీ అసెంబ్లీ 
 

Published date : 06 Sep 2021 01:55PM

Photo Stories