Frauds in Banks: బ్యాంకింగ్‌లో 51 శాతం తగ్గిన మోసాలు
Sakshi Education
2021-22 Financial Year: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఎంత శాతం మోసాలు తగ్గాయి?
ప్రస్తుత ఏడాది మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో జరిగిన మోసాలు 51శాతం తగ్గాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)ల్లో మొత్తం రూ.81,921.54కోట్ల విలువైన మోసాలు జరగ్గా.. 2021–22లో ఇవి రూ.40,295.25 కోట్లకు చేరుకున్నాయని సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ)ద్వారా వచ్చిన దరఖాస్తుకు ప్రతిస్పందనగా అందించిన వివరాల్లో ఆర్‌బీఐ తెలిపింది. 2021–22లో పీఎస్‌బీల్లో మొత్తం 7,940 మోసాలు నమోదవగా.. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 9,933 సంఘటనలు జరిగాయి.
FDIs: 2021–22లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రికార్డు
Published date : 24 May 2022 04:08PM