Skip to main content

Jewar Airport: ఆసియాలోనే అతి పెద్ద విమానాశ్రయాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారు?

Noida Airport

ఆసియాలోనే అతి పెద్దదైన ‘నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి’ భారత ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 25న శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని జెవర్‌ పట్టణంలో ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... ‘సబ్‌కా సాత్‌– సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్‌– సబ్‌కా ప్రయాస్‌’ అన్నదే తమ ప్రభుత్వ మంత్రం అని స్పష్టం చేశారు.

నోయిడా విమానాశ్రయ ప్రత్యేకతలు..

  • ఆసియాలోనే అతి పెద్ద విమానాశ్రయం ఇది. 51 చదరపు కి.మీ. విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నారు.  
  • స్విట్జర్లాండ్‌కు చెందిన జ్యురిచ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు కంపెనీ దీని నిర్మాణం చేస్తోంది.  2024 నాటికి తొలి దశ పనులు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.  
  • 1,334 హెక్టార్ల విస్తీర్ణంలో పనులు ప్రారంభిస్తున్నారు. విమానాశ్రయం పూర్తయ్యే సమయానికి రూ. 35 వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనాలున్నాయి.  
  • ఈ విమానాశ్రయంతో లక్ష మందికిపైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.  
  • గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయమైన ఇందులో ఎకో ఫ్రెండ్లీ వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తున్నారు. కర్బన ఉద్గారాలు జీరో శాతం లక్ష్యంగా విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. పశ్చిమ యూపీ, ఢిల్లీ, హరియాణా, రాజస్తాన్‌ ప్రయాణికులు వినియోగించుకోవచ్చు.  
  • ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఏడాదికి 1.2 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని ఒక అంచనా.

చ‌ద‌వండి: దేశంలోనే తొలి ఆహార మ్యూజియం ఎక్కడ ఏర్పాటైంది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆసియాలోనే అతి పెద్దదైన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు    : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ    : జెవర్‌ పట్టణం, గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం
ఎందుకు : రాష్ట్రాభివృద్ధి కోసం..

డౌన్‌లోడ్‌చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌చేసుకోండి.

యాప్‌డౌన్‌లోడ్‌ఇలా...
డౌన్‌లోడ్‌వయా గూగుల్‌ప్లేస్టోర్‌

Published date : 26 Nov 2021 01:06PM

Photo Stories