Raja Mahendra Pratap Singh: రాజా ప్రతాప్ సింగ్ యూనివర్సిటీకి ఎక్కడ శంకుస్థాపన చేశారు?
జాట్ సామాజిక వర్గానికి చెందిన ప్రతాప్ సింగ్ స్మృత్యర్థం రాష్ట్ర ప్రభుత్వం ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోంది. స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త, సంఘ సంస్కర్త అయిన రాజా ప్రతాప్ సింగ్ పేరుతో లోధా, జరౌలి గ్రామాల్లోని 92 ఎకరాల్లో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. దీనికి అనుబంధంగా 395 కాలేజీలు పని చేస్తాయి.
చదవండి: విద్యార్థుల కోసం సర్దార్‌ధామ్ భవన్‌ను ఏ నగరంలో నిర్మించారు?
శంకుస్థాపన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ... ఇంటి భద్రత కోసం వేసే తాళాలకు అలీగఢ్ ఎలా ప్రఖ్యాతి వహించిందో, సరిహద్దుల్లో రక్షణ అంటే కూడా అలీగఢ్ పేరే ఇక వినిపిస్తుందని పేర్కొన్నారు. అలీగఢ్‌లో ఏర్పాటు కానున్న రక్షణ పారిశ్రామిక కారిడార్‌కు సంబంధించిన ఎగ్జిబిషన్‌ను ప్రధాని సందర్శించారు. ప్రధానితో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్టేట్ యూనివర్సిటీకి శంకుస్థాపన
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : అలీగఢ్, ఉత్తరప్రదేశ్
ఎందుకు : స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త, సంఘ సంస్కర్త అయిన రాజా ప్రతాప్ సింగ్ స్మృత్యర్థం...