Skip to main content

PM Vishwakarma Kaushal Samman: పీఎం విశ్వకర్మ సమ్మాన్‌ పథకం ల‌క్ష్యం ఇదే..

బడ్జెట్‌ వెబినార్లలో చివరిదైన ‘పీఎం విశ్వకర్మ కౌశల్‌ సమ్మాన్‌’ పథకంపై ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 11న మాట్లాడారు.
'PM Vishwakarma Kaushal Samman Yojana' webinor

వృత్తి పనివాళ్లకు, చిన్న వ్యాపారాలకు మరింత తోడ్పాటు అందించాల్సిన అవసరముందని ఆయ‌న అభిప్రాయపడ్డారు. గ్రామ స్థాయిలో ప్రతి వృత్తినీ విభాగాన్నీ బలోపేతం చేయడం దేశ ప్రగతి ప్రయాణానికి చాలా కీలకమన్నారు. ఇందుకోసం డెడ్‌లైన్లు పెట్టుకుని ఉద్యమ స్ఫూర్తితో పని చేయాల్సిన అవసరముందన్నారు. గొప్పవైన మన పురాతన సంప్రదాయాలను కాపాడటంతో పాటు చిన్న వ్యాపారాలను వాటిలో భాగస్వాములుగా ఉండే వృత్తి పనివాళ్లకు ఇతోధికంగా సాయం అందించడమే పీఎం విశ్వకర్మ సమ్మాన్‌ పథకం లక్ష్యమని చెప్పారు. 
సులభ రుణాలు, నైపుణ్య వృద్ధికి అవకాశాలు, సాంకేతిక, డిజిటల్‌ సాయం, బ్రాండ్‌ ప్రమోషన్, మార్కెటింగ్, ముడి సరుకు లభ్యత తదితరాల్లో వారికి ఈ పథకం అండగా నిలుస్తుందన్నారు. వృత్తి పనివాళ్లకు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు అన్ని అవకాశాలూ కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons) క్విజ్ ( 12- 18 ఫిబ్రవరి 2023 )


మోదీ తల్లి స్మృతులపై మైక్రోసైట్‌ 
మోదీ మాతృమూర్తి హీరాబెన్‌ స్మృతుల సమాహారంగా ‘మా’ పేరిట మైక్రోసైట్‌ ఆయన అధికార వెబ్‌సైట్‌లో ప్రారంభమైంది. ఇటీవల మరణించిన ఆమెకు నివాళిగా దీన్ని తీర్చిదిద్దినట్టు అధికారులు తెలిపారు. ‘‘బిడ్డలకు హీరాబెన్ నేర్పిన విలువలు తదితరాల విశేషాలు సైట్‌లో ఉంటాయి. హీరాబా జీవితం, ఫొటోలు, వీడియోలు, ఆమె వందో పుట్టినరోజు సందర్భంగా మోదీ రాసిన బ్లాగ్, ఆమె మృతిపై పలు దేశాధినేతల స్పందన, నివాళులు కూడా ఉంటాయి’’ అని వివరించారు.

Manik Saha: రెండోసారి త్రిపుర సీఎంగా మాణిక్‌ సాహా

Published date : 13 Mar 2023 06:53PM

Photo Stories