IFFI: ఇండియన్ పనోరమ వేడుకలను ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు?
గోవా రాష్ట్ర రాజధాని పనాజిలో ఇండియన్ పనోరమా 52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ)ను నిర్వహించనున్నారు. 2021, నవంబర్ 20 నుంచి 28 వరకూ తొమ్మిదిరోజులపాటు జరిగే ఈ వేడుకల్లో 25 ఫీచర్ ఫిల్మ్‌లు, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్‌లు ప్రదర్శించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రముఖ కూచిపూడి నృత్య కారిణి సంధ్యా రాజు నటించి, నిర్మించిన తెలుగు చిత్రం ‘‘నాట్యం’’ను ఈ వేడుకల్లో ప్రదర్శించనున్నారు. రేవంత్‌కుమార్ కోరుకొండ దర్శకత్వం వహించిన నాట్యం చిత్రం ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకొంది.
కూచిపూడి...
కూచిపూడి నృత్యం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక భారతీయ నాట్యం. ఇది కృష్ణా జిల్లాలోని కూచిపూడి (మొవ్వ మండలం) గ్రామంలో ఆవిర్భవించింది. ఇది దక్షిణ భారతదేశం అంతటా పేరుగాంచింది.
కొందరు ప్రముఖ కూచిపూడి నర్తకులు
- వెంపటి చినసత్యం
- వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి
- ఉమా రామారావు
- తాడేపల్లి పేరయ్య
- చింతా కృష్ణమూర్తి
- సి.ఆర్.ఆచార్యులు
- నటరాజ రామకృష్ణ
- శోభా నాయుడు
- పసుమర్తి వేణుగోపాల కృష్ణశర్మ
- యామినీ కృష్ణమూర్తి
- స్వప్నసుందరి
- రాధారెడ్డి, రాజారెడ్డి
- మంజు భార్గవి
- వెంపటి రవి
- వేదాంతం సత్యనారాయణ శర్మ
- వేదాంతం వెంకట నాగ చలపతిరావు
- వేదాంతం సిద్ధేంద్ర వరప్రసాద్
- ఆనంద శంకర్ జయంత్
- పద్మజా రెడ్డి
- యేలేశ్వరపు శ్రీనివాసులు
- పెదపూడి నాగశ్రీ ప్రవల్లిక
చదవండి: ఆది శంకరాచార్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఎక్కడ ప్రాంరభించారు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్