Nitish Kumar : బిహార్ సీఎంగా 8వ సారి..
ఆగస్టు 10న రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఫగు చౌహాన్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. మహా ఘట్‌బంధన్‌కు సారథ్యం వహిస్తున్న కీలక భాగస్వామ్య పార్టీ అయిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా వెనువెంటనే ప్రమాణం చేశారు. జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also read: Ruchira Kamboj: ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా తొలి మహిళ
243 మంది సభ్యుల బిహార్ అసెంబ్లీలో ఆర్జేడీకి 79 మంది, జేడీ(యూ)కు 43 మంది ఎమ్మెల్యేలుండగా కాంగ్రెస్‌కు 19 మంది ఉన్నారు.
2014 ఇప్పుడు గతం..
ఎన్డీఏ సంకీర్ణానికి నితీశ్ ఆగస్టు 9న గుడ్‌బై చెప్పారు. సీఎం పదవికి రాజీనామా చేశారు. తద్వారా బీజేపీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహా ఘట్‌బంధన్‌లో చేరి మర్నాడే మరోసారి సీఎం అయ్యారు.
Also read: Twin Towersను సీఎం కేసీఆర్ ఎప్పుడు ప్రారంభించారు?
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP