Omicron New Variant: భారత్‌లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్.. దీని లక్షణాలు ఇవే..
భారత్‌లో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. దీంతో కరోనా ఖతమయ్యిందనుకున్నాం. అందుకు తగ్గట్టే అన్ని రాష్ట్రాలు మాస్క్ ధరించడం మినహా అన్ని కోవిడ్ ఆంక్షలను క్రమంగా ఎత్తేస్తున్నాయి. అయితే తాజాగా మహమ్మారికి సంబంధించి మరో పిడుగులాంటి వార్త ప్రజలను కలవరానికి గురిచేస్తోంది.
Omicron: మనిషి చర్మంపై ఒమిక్రాన్ ఎన్ని గంటలు బతికుంటుందో ఉంటుందో తెలుసా..?
భారత్‌లో ప్రవేశం.. లక్షణాలు
భారత్‌లో ఒమిక్రాన్‌లో రెండు కొత్త వేరియంట్‌లు వెలుగు చూశాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఒకరికి ఒమిక్రాన్ ఎక్స్‌ఈ (XE) వేరియంట్ కేసు నమోదైనట్లు బృహాన్ ముంబై కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. దీంతోపాటు మరొకరికి కాపా వేరియంట్ కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. అయితే కొత్త రకం వేరియంట్ నమోదైన వారిలో ఎవరికీ తీవ్ర లక్షణాలు లేవని, ఎవరికీ ఆక్సిజన్ సపోర్ట్, ఐసీయూ అవసరం లేదని బీఎంసీ అధికారులు తెలిపారు.
కేంద్ర వైద్యారోగ్యశాఖ అప్రమత్తం..
ఇదిలా ఉండగా యూకేలో జనవరి 19న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ XE కేసు నమోదైంది. ఇక ఒమిక్రాన్ - BA.1, BA.2 నుంచి రూపాంతరం చెందినదే ఈ కొత్త వేరియంట్ XE. ప్రస్తుతంలో ప్రపంచంలో దీని కేసులు ఎక్కువ నమోదు కాలేదు కానీ ఇతర వేరియంట్ల కంటే ఇది 10 శాతం ఎక్కువగా వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. మరోవైపు దేశంలో కొత్త వేరియంట్ వెలుగు చూసిన క్రమంలో కేంద్ర వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది.
Covid Effect: ఊహకందని విషయం ఇది.. 7 నెలల కన్నా ఎక్కువ కాలం మనిషి శరీరంలో...?
కేసులు..
ఇప్పటికీ ఒమిక్రాన్ ఉపకరం బీఏ.2 పలు దేశాల్లో విస్తరిస్తూనే ఉంది. అమెరికాలో కొత్తగా వెలుగు చూస్తున్న కేసుల్లో అత్యధికం ఈ రకానివే ఉంటున్నాయి. కానీ, ఎక్స్ఈ అన్నది రెండు రకాల హైబ్రిడ్ వెర్షన్. ఒమిక్రాన్ బీఏ.1, బీఏ.2 కలగలిసిన రూపం. ఇదిలా ఉంటే.. ఎక్స్ఈ రకాన్ని మొదటిసారిగా 2022 జనవరి 19న బ్రిటన్ లో గుర్తించారు. ప్రస్తుతానికి ఎక్స్ఈ కేసులు చాలా స్పల్ప స్థాయిలోనే ఉన్నాయట. అయితే ముందు ముందు పరిస్థితిని అంచనా వేయలేమని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తోంది.
New Virus in China:మళ్లీ కొత్త వైరస్? ..అసలు సంగతి ఇదే.. ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే..
New variant: ఇజ్రాయెల్‌లో కరోనా కొత్త వేరియంట్ కలకలం.. లక్షణాలు ఇవే..
Good News : ఏడాది చివరికి కరోనా అంతం..! డబ‍్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన..