National Logistics Policy: నేషనల్ లాజిస్టిక్ పాలసీని విజ్ఞాన్ భవన్ లో ప్రారంభించారు
Sakshi Education
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల(సెప్టెంబర్) 17న నేషనల్ లాజిస్టిక్ పాలసీని విజ్ఞాన్ భవన్ లో ప్రారంభించారు. ఖర్చులను తగ్గించడంతోపాటు గ్లోబల్ మార్కెట్‌లో దేశీయ ఉత్పత్తుల పోటీతత్వాన్ని మెరుగుపర్చుకోవడానికి లాజిస్టిక్ పాలసీని ప్రవేశ పెట్టారు. వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపిన వివరాల ప్రకారం–ఈ పాలసీ వల్ల దేశం నలుమూలలా ఎలాంటి అంతరాయం లేకుండా ఉత్పత్తులను రవాణా చేయవచ్చు. ప్రాసెస్ రీ ఇంజనీరింగ్, డిజిటలైజేషన్, మల్టీ మోడల్ ట్రాన్ ్సపోర్ట్‌లపై ఎక్కువ దృష్టి సారిస్తుంది’ అని పేర్కొన్నారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 03 Oct 2022 05:38PM