Skip to main content

Mumbai-Pune Expressway: హైవేలపై ప్రమాదాల నివారణకు ఏఐ లెన్స్‌ కెమెరా.. దాని సామర్థ్యం ఎంతంటే..?

మహారాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న పలు చర్యలను వేగవంతం చేస్తోంది.
Mumbai-Pune Expressway

ఈ నేపధ్యంలోనే ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌ హైవే ట్రాఫిక్‌ మనేజిమెంట్‌ సిస్టమ్‌(హెచ్‌టీఎంఎస్‌)కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ సిస్టమ్‌ ఈ ఏడాది సెప్టెంబరు నాటికి పూర్తికావచ్చని సమాచారం. ఈ సిస్టమ్‌తో వాహన వేగాన్ని గుర్తించడమే కాకుండా, నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చర్యలు చేపట్టేందుకు మరింత అవకాశం లభిస్తుంది. ఈ సిస్టమ్‌ పూర్తిగా ఆటోమేటెడ్‌ విధానంలో కొనసాగనుంది.
గడచిన కొద్ది నెలల నుంచి రవాణాశాఖ రాష్ట్రంలోని అన్ని ఆర్టీవోలకు రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని ఆదేశించింది. కాగా హెచ్‌టీఎంఎస్‌లో ముంబై నుంచి పూణె మధ్య 93 స్పాట్‌లలో హైటెక్‌ కెమెరాలను ఇన్‌స్టాల్‌ చేయనున్నారు. ఈ కెమెరాలు వాహన వేగాన్ని గుర్తించే సామర్థ్యం కలిగివుంటాయి. ఈ కెమెరాలలో హైరిజల్యూషన్‌ ఉన్న కారణంగా వాహనంలోని డ్రైవర్‌ సీటు బెల్టు పెట్టుకున్నాడో లేదో కూడా ఈ కెమెరా చూపిస్తుంది.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (07-13 మే 2023)

ఏఐ ఆధారిత లెన్సులు కలిగిన ఈ కెమెరా.. వాహన నంబరు ప్లేటు ఆధారంగా సమాచారాన్నంతా సేకరించి, వెంటనే కంట్రోల్‌ రూమ్‌కు పంపిస్తుంది. ఈ హైవేలో ఇలాంటి 370 కెమెరాలను అమరుస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌ హైవేపై రోడ్డు ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నందున వాటి నియంత్రణకు హెచ్‌టీఎంఎస్‌ ప్రాజెక్టు ప్రారంభమయ్యింది. ఇది సమగ్రంగా కార్యకలాలు ప్రారంభించాక రోడ్డు ప్రమాదాలు మరింతగా తగ్గుతాయని రవాణాశాఖ అధికారులు భావిస్తున్నారు. 

Saare Jahan Se Achha: 'సారే జహాన్‌ సే అచ్ఛా'రాసిన కవి గూర్చి సిలబస్‌ నుంచి తొలగింపు

Published date : 29 May 2023 01:23PM

Photo Stories